Pages

దేవుడా నువ్వెక్కడ ?

ప్రసిద్ధ  పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుణ్యక్ష్యేత్రములో భక్తుల గందరగోళ పరిస్థితి ఇది . 

ఇటీవల కాలం లో లెక్కకు మించిన భక్తుల తాకిడితో ద్వారకాతిరుమల భక్తుల సంఖ్య  పెరిగింది. దీనికి అనుగుణంగా 

దేవాస్థాన యాజమాన్యం పెద్ద ఎత్తున కేశఖండన శాల , అన్నదాన శాల, భక్తుల క్యూ  లైనులు ఏర్పాట్లు చక చక చేసింది. 

ఈ  ఏర్పాట్లు నేపథ్యం లో సగటు సమాన్య  భక్తుడు ఆర్టీసీ బస్సు దిగిన లగాయతు తన నీలాల మొక్కులు తీర్చుకుని , 

దైవ  దర్శనం చేసుకుని ఆ భారీ  క్యూ లైనులో ప్రసాదాలు కొనుక్కుని కాలే కడుపుతో అన్నదానం లో భోజనం చేసి తిరిగి 

ఆర్టీసీ బస్టాండ్  చేరేసరికి పరిస్థితి ఒక్కసారిగి పదికేజిలు బరువు తగ్గినట్టుగా రోగి పరిస్థితి ఏర్పడింది . ఇన్ని ప్రయాసల 

మధ్య తనను ఆదుకునే దేవుడు ఎక్కడ అని భక్తుడు రోధిస్తున్నాడు . గతం లో 45 మెట్లు కొండెక్కి పక్కనే ఉన్న పడమట 

గోపురంలో కేశఖండన శాల మొక్కు తీర్చుకుని  డైరెక్టుగా  క్యూ  లైనులోకి వచ్చి దర్శనం చేసుకునేవాళ్ళు . మెట్లు 

దిగగానే అన్నదానం లో భోజనం  చేసి పది అడుగుల దూరం లో ఆర్టీసీ బస్సు ఎక్కేవారు . ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్  

నుండి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీవారి కేశఖండన శాల  దూరంగా విసిరి వేయ బడింది . తంటాలు పది 

కేశఖండన శాలలో మొక్కులు తీర్చుకున్న భక్తుడు శ్రీవారి దర్శనానికి రావడానికి సుమారుగా అరకిలోమీటరున్న ఎత్తైన 

మెట్ట, ఎర్రటి ఎండను, బోరున పడే వర్షాలను లెక్క చేయక నడుచుకుంటూ వెళితేనే శ్రీవారి దర్శనం. ఈ మధ్యలో తమ 

లగేజీలు ఎక్కడ పెట్టాలి? తల  నీలాల మొక్కులు తీర్చుకునే భక్తుల కుటుంబాలు ఎక్కడ ఉండాలి? ఇవన్నీ ప్రశ్నలే . 

నడవలేక నడవలేక ఆయాసపడే వృద్ధులు, రోగులు బాధలైతే మరి.. వర్ణణాతీతం అని చెప్పాలి. ఎక్కడో తిరుమల 

తిరుపతి దేవస్థానాన్ని ఆదర్శంగా చేసుకుని భవనాలు సిమెంటు కట్టడాలు ఐతే కట్టారు గాని  భక్తులకు  అందుబాటులో 

ఇవేమి లేకపోవటం బాధాకరమైన విషయం . దర్శనం అనంతరం  దేవస్థానం అన్నదాన సత్రానికి వెళ్లాలంటే ఆ 

మిట్టమధ్యాన సమయంలో కిలోమీటరు దూరం నడవాలి . దేవస్థానం ఉచిత బస్సు సర్వీసులు పేరుకు మాత్రమే తప్ప 

అందరి భక్తుల అవసరాలు తీర్చేవిధంగా బస్సులు లేకపోవటం, శ్రీవారి కేశఖండన శాల నుండి దర్శనం కౌంటర్లకు 

మధ్య నడక ఒకటే ఇప్పటికి శరణ్యముగా ఉండటం, భక్తులకు శ్రీవారి దర్శనం భారంగానే కొనసాగుతుంది. ఈ 

అలసటలో శ్రీవారి దర్శన ఆనందాన్ని భక్తుడు పూర్తిగా అనుభవించలేకపోవడం శోచనీయం కాదా . 

No comments:

Post a Comment