Pages

Unknown Feel - A Heart with a Sea

ఎదో ఒక తెలియని భావన అలల అంచున

అంచుల దగ్గరే ఆ అనుభూతి , ఆనందం...

అక్కడ కూర్చునంత సేపు silent గానే ఏదో సడి చేస్తుంటుంది మనసు 
            
మెల్లగా మొదలవుతుంటాయి అలలు మనసులో

అలలు వాటి మాటలు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు గా

సముద్రం అంతా  నిశ్శబ్దం 

మనసులో అలల అలజడి 

ఆ అలజడి అంచుల ముందు

మొకాళ్ళ మీద నేను నాతోపాటు నా  నీడ

నీడ వెంటే కాలి జాడ 

కాలి జాడల ఖాళీ జాడల్ని నింపే పనిలో ప డుతూ

సముద్రం తోడుగా  వస్తుంది

ఆ తోడు మనిషి ఇవ్వలేడు

ఆ భాష మనిషకి రాదు

అలల భాషకి  లిపి ఉండదు లిప్స్ కి మాటలు అందవు 

మనసులో దాక్కుని ఉంటాయి భావాలన్నీ 

కానీ తొంగి చూస్తూ ఉంటాయి కొంటెగా 

భలేగా ఆడుకుంటాయిలే 

భావాలు కూడా బహుసా అరుగు మీద ఆడపిల్లలు కాబోలు

మనో యుద్ధం

మనలో మనం, మనతో మనం చేసే యుద్ధం....మనో యుద్ధం.

Man of courage - Bhagat Singh

Travel - Treasure - Happiness

Travel is Treasure of Happiness. The more you travel the more you treasure your happiness.