ఎదో ఒక తెలియని భావన అలల అంచున
అంచుల దగ్గరే ఆ అనుభూతి , ఆనందం...
అక్కడ కూర్చునంత సేపు silent గానే ఏదో సడి చేస్తుంటుంది మనసు
మెల్లగా మొదలవుతుంటాయి అలలు మనసులో
అలలు వాటి మాటలు కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు గా
సముద్రం అంతా నిశ్శబ్దం
మనసులో అలల అలజడి
ఆ అలజడి అంచుల ముందు
మొకాళ్ళ మీద నేను నాతోపాటు నా నీడ
నీడ వెంటే కాలి జాడ
కాలి జాడల ఖాళీ జాడల్ని నింపే పనిలో ప డుతూ
సముద్రం తోడుగా వస్తుంది
ఆ తోడు మనిషి ఇవ్వలేడు
ఆ భాష మనిషకి రాదు
అలల భాషకి లిపి ఉండదు లిప్స్ కి మాటలు అందవు
మనసులో దాక్కుని ఉంటాయి భావాలన్నీ
కానీ తొంగి చూస్తూ ఉంటాయి కొంటెగా
భలేగా ఆడుకుంటాయిలే
భావాలు కూడా బహుసా అరుగు మీద ఆడపిల్లలు కాబోలు
No comments:
Post a Comment