Pages

రోజూ తిరగ(గా)లి

చీకటి కమ్మేసి
దుప్పటి కప్పేసి
కన్నులు మూతేసి
నిద్దుర ముంచెత్తుకొస్తుంది మబ్బులాగా

ఇక దుప్పటి కప్పాలి
నిద్దురపోవాలి
కలల్నికనాలి
పొద్దున్నే లేవాలి
ఆఫీసుకి వెళ్ళాలి
టైముకి తినాలి
తిరిగి రావాలి
మళ్ళీ కథ మొదలుపెట్టాలి

ఇక దుప్పటి కప్పేసి 
నిద్దుర పట్టేసి 
కలల్ని కనేసి 
పొద్దున్నే లేచేసి 
ఆఫీసుకి  వెల్లేసి 
టైముకి తినేసి 
తిరిగి వచ్చేసి 
మళ్ళీ కథ మొదలుపెట్టేసి 

No comments:

Post a Comment